Bandaru Satyanandarao
MLA Kothapeta Constituency | Ex Ethics Committee Chairman, A.P.L.A | Former Member Acharya N.G Ranga Agriculture University
Recent Posts
కొత్తపేట మండలం మోడేకుర్రు పంచాయతీ రాకుర్తివారిపాలెం గ్రామానికి చెందిన కురసా నాగభూషణం గారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు జరిగిన పూజా కార్యక్రమానికి హాజరై, స్వామివారిని దర్శించుకున్నాను. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశాను. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నాగభూషణం గారికి అభినందనలు తెలియజేశాను. #SocialService #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదలకు ఒక్కరోజే ఉంది... అభివృద్ధి, ఆనంద ఆంధ్రప్రదేశ్ రోడ్ మ్యాప్ సిద్ధమైంది.. #SwarnaAndhra2047 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించడం అనేది కూటమి ప్రభుత్వ స్పూర్తి. లొల్ల లాకుల వద్ద కేరళ స్థాయిలో పడవల పోటీలు నిర్వహించేందుకు పలు ప్రభుత్వ శాఖలతో కలిసి సమీక్షలు జరిపాను. సంక్రాంతి కంటే ముందే గోదావరి ట్రోపీ పోటీలతో మన జిల్లాకు పండుగ వాతావరణం నెలకొల్పాలని అనుకుంటున్నాం. ఈ వేడుకల్లో రంగవల్లుల పోటీలు, ఈత పోటీలు, గాలి పతంగుల పోటీలు, మరియు కేరళ-style పడవ పోటీలు వంటి వినోదాత్మక కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకలు పర్యాటకులను ఆకర్షించేలా రూపొందిస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చినా వారికి మంచి వాతావరణం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. విజేతలకు ప్రతిష్టాత్మక బహుమతులు అందజేస్తాం. ఈ కార్యక్రమంలో సహకరించి, అందరికీ పండుగ వాతావరణం అందిద్దాం! #GodavariTrophy #FestivalAtmosphere #BeforeSankranti #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
రావులపాలెం సి ఆర్ సి కళ్యాణ మండపంలో ఈ రోజు జరిగిన కొత్తపేట మాజీ జేపీటీసీ ధరణాల రామకృష్ణ గారి తమ్ముడు కుమార్తె వివాహానికి హాజరయ్యాను. అలాగే కొత్తపేటలోని ఆర్ ఎస్ బీసీ కన్వెన్షన్ హాల్ లో జరిగిన కముజు రాయుడు వార్ల వివాహానికి స్థానిక నాయకులతో కలసి పాల్గొన్నాను. ఈ సందర్బంగా నూతన వదూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాను. #Wedding #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
పీపుల్స్ యాక్షన్ ఫర్ రూరల్ ఎవెక్నింగ్ (పారా) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వరద విపత్తు సమయంలో సిద్ధంగా ఉండే చర్యలపై అవగాహన గోడ పత్రికను రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆవిష్కరించాను. ఈ కార్యక్రమం ద్వారా వరద కారణంగా పటిష్టమైన చర్యలను చేపట్టడం, ప్రజలలో అవగాహన పెంచడం ముఖ్యమైనవి. #Para #CommunityAwareness #FloodPreparedness #PublicSafety #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వంలో అడుగులు వేస్తున్నాం. ఇందులో భాగంగా కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను పరిశీలించి, వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నాను. కళాశాలకు 3 ఫేజ్ విద్యుత్, భవనాల మరమ్మతు, మరుగుదొడ్లు, నీటి సరఫరా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించాను. అలాగే.. విద్యార్థులే స్వచ్ఛందంగా దేవాలయం వంటి కళాశాలను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేశాను. #GovtCollege #Intermediate #Students #Education #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
ప్రజారోగ్యం, వైద్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ సందర్భంగా వార్డులు, పరిశుభ్రత, డ్రైనేజీ పరిశీలించి.. రోగులతో మాట్లాడాను. అలాగే ఆస్పత్రిలో వసతులు మెరుగు పరచడంతో పాటు వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చాను. #PublicHealth #Hospital #Doctors #NDA2024 #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామం కొత్త కాలనీలో ఈరోజు జరిగిన కిస్మస్ వేడుకకు హాజరై అనంతరం నూతన ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించాను. అలాగే పొడగట్లపల్లి గ్రామం కుక్కలకోటులో జరిగిన క్రిస్మస్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మత పెద్దలు బోధనలు వినడంతో పాటు క్రైస్తవ సోదర, సోదరీమణులతో వేడుకల్లో పాల్గొన్నాను. #SemiChristmas #HappyChristmas #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
జనవరి 5న విజయవాడలో జరగనున్న విశ్వ హిందూ పరిషత్ - ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా వారితో సంఘం కార్యక్రమాలపై చర్చించి, నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. #VishwaHindhuParishath #Devotional #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
ప్రపంచ వ్యాప్తంగా ఆనందంగా జరుపుకొనే అతి పెద్ద పండగ.. క్రిస్మస్. కొత్తపేట మండలం వాడపాలెం సీడబ్ల్యూఎస్ గ్రౌండ్ లో కొత్తపేట మండల పాస్టర్స్ ఐక్య గ్లోరియస్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాను. క్రీస్తు సందేశాన్ని వినిపిస్తున్న సేవకుల అంకితభావాన్ని ప్రశంసించాను. #SemiChristmas #HappyChristmas #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
వాడపాలెం లోని కార్యాలయంలో గౌరవ పూర్వకంగా నన్ను కలిసిన రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కడుపూడి సత్తిబాబు గారిని దుశ్శాలువాతో సత్కరించాను. అలాగే ఈనెల 15న రాజమండ్రిలో జరగనున్న శెట్టిబలిజ, శ్రీశయన, యాత, ఈడిగ మహాదన్ను సభ కరపత్రాన్ని ఆవిష్కరించాము. #SettiBalijaCoorporation #KadupudiSattiBabu #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
విద్యార్థి దశ నుంచే వివిధ పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభ బయట పడటంతో పాటు పోటీతత్వం అలవడుతుంది. రిలయన్స్ ధీరూభాయ్ అంబానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన క్విజ్ పోటీలో విజేతలకు కొత్తపేట శ్రీ సిద్ధార్థ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్దులకు ఈరోజు బహుమతులు అందజేశాను. వారిని అభినందించి, భవిష్యత్తులో మరింతగా రాణించాలని ప్రోత్సాహించాను. #RelianceFoundation #Ambani #Students #Education #KothapetaConstituency #BandaruSatyanadharao #BandaruSanjeev
Similar Influencers
Nikole Goncalves | Healthy Food + Lifestyle
Armen Adamjan
MindsetHealer
Attic Fanatics
RSMS PEST CONTROL
Yahya Kaludi | Civil By Yahya Sir
Banwet Waterproofing Info
PRIME PHYSIQUE | HEALTH | BIOHACKING | GYM
Manorama Online
Shipshape
SATYA ELECTRICALS
PS Electronica (E+AutOff)
Fast Company
orunattapranthan | Malayali Tech Enthusiast
Subsidence Ltd
Aeroo Shield
SafeQ
Cairns Cleaning League
Brent Fletcher
dr cardio
Barbara O’Neill
Saintly Care
Justin Ford STR Safety Expert
SWELL Home Inspections
Royaltyautoservice
USDOT NHTSA
America Saves Money
Byron Lazine
Wealthfront